మరోసారి నక్కా ఆనంద్ బాబు ఇంటికి పోలీసులు

ABN , First Publish Date - 2021-10-19T17:38:47+05:30 IST

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి మరోసారి పోలీసులు చేరుకున్నారు. నర్సీపట్నం నుంచి పోలీసులు వచ్చారు.

మరోసారి నక్కా ఆనంద్ బాబు ఇంటికి పోలీసులు

గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి మరోసారి పోలీసులు చేరుకున్నారు. నర్సీపట్నం నుంచి  పోలీసులు వచ్చారు. కాగా పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. గోబ్యాక్.. గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నక్కా ఆనంద బాబు ఇంటికి తరలిచ్చారు. గత రాత్రి ఆనంద బాబు ఇంటికి వచ్చిన విశాఖ పోలీసులు...విశాఖలో గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై మీడియా సమావేశంలో  మాట్లాడిన అంశాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని అడిగారు. అయితే అర్థరాత్రి సమయంలో పోలీసులు రావడంపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఈరోజు వస్తామని చెప్పి  పోలీసులు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-19T17:38:47+05:30 IST