నాదెండ్ల బ్రహ్మంకు 14 రోజుల రిమాండ్
ABN , First Publish Date - 2021-10-21T19:53:47+05:30 IST
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.

గుంటూరు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా బ్రహ్మంకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న ఉదయం టీడీపీ ఆఫీస్కు వెళ్తుండగా ఉండవల్లి వద్ద నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.