తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2021-03-22T05:39:49+05:30 IST

వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసులకు భయపడే ప్రసక్తేలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు(ఆంధ్రజ్యోతి), మార్చి21: వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసులకు భయపడే ప్రసక్తేలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి టీడీపీ ఏజెంట్‌ను గాయపరిచిన మోదుగులపై ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై కోర్టులో ప్రైవేటు కేసు ధాఖలు చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే 50వ డివిజన్‌ టీడీపీకి చెందిన దళిత అభ్యర్థి, ఆయన సోదరుడిపై చైన్‌స్నాచింగ్‌, దారి దోపిడి కేసుల పెట్టడం చూస్తుంటే పోలీసు వ్యవస్థ ఎంత నీచానికి దిగజారిందో అర్ధమవుతుందన్నారు. టీడీపీ నాయకులపై పెడుతున్న కేసులను చూస్తుంటే పాకిస్తాన్‌లో కూడా ప్రజాస్వామ్యం ఇంతగా అపహాస్యం కావడం లేదన్నారు.


Updated Date - 2021-03-22T05:39:49+05:30 IST