విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-01-13T05:49:03+05:30 IST

మేడికొండూరు పంచాయతీ కార్యాలయంలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, మాజీ జడ్పీటీజీ పాములపాటి శివన్నారాయణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ నార్నె శ్రీనివాసరావు తదితరులు మంగళవారం గుంటూరులో జేసీ శ్రీధర్‌రెడ్డిని కలిసి విన్నవించారు.

విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దు
జేసీతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రావణ కుమార్‌ తదితరులు

మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌

మేడికొండూరు, జనవరి 12: మేడికొండూరు పంచాయతీ కార్యాలయంలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, మాజీ జడ్పీటీజీ పాములపాటి శివన్నారాయణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ నార్నె శ్రీనివాసరావు తదితరులు మంగళవారం గుంటూరులో జేసీ శ్రీధర్‌రెడ్డిని కలిసి విన్నవించారు. కార్యాలయ ఆవరణలో భవన నిర్మాణాలకు పోను కొద్దిస్థలం మాత్రమే ఉందని, దీనిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు, అధికారులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈమేరకు వినతి పత్రం అందజేశారు.  

- ఇదిలా ఉంటే ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయాలన్న వైసీపీ నాయకుల స్పీడుకు మంగళవారం అధికారులు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. సోమవారం రాత్రి పంచాయతీ ఆవరణలో కొందరు కూలీలతో గుంతలు తీస్తుండగా స్థానికులు, టీడీపీ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు పనులను నిలిపి వేయించారు. గ్రామస్తులు, తెలుగుదేశం నాయకులు మోహరించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయం అధికారులకు తెలియడంతో.. అనుమతి లేకుండా విగ్రహ నిర్మాణం చేపట్టవద్దని సూచించారు. 


Updated Date - 2021-01-13T05:49:03+05:30 IST