ఎర్రన్నాయుడు సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-11-03T05:10:51+05:30 IST

దివంగత కింజారపు ఎర్రన్నాయుడు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.

ఎర్రన్నాయుడు సేవలు మరువలేనివి
ఎర్రన్నాయుడుకు నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్‌బాబు, మహ్మద్‌ నసీర్‌ తదితరులు

నక్కా ఆనంద్‌బాబు

గుంటూరు, నవంబర్‌ 2(ఆంధ్రజ్యోతి): దివంగత కింజారపు ఎర్రన్నాయుడు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎర్రన్నాయుడు వర్ధంతి  నిర్వహించారు. ఆనందబాబు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, పార్లమెంట్‌ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, కేంద్రమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఎర్రన్నాయుడు క్రమశిక్షణ, నిబద్దత కలిగి పార్టీనే శ్వాస, ఊపిరిగా జీవించారన్నారు. కార్యక్రమంలో పిల్లి మాణిక్యరావు, దాసరి రాజామాస్టారు, చిట్టాబత్తిన చిట్టిబాబు, హసనభాషా, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్‌, యల్లావుల అశోక్‌యాదవ్‌, ఈరంటి వరప్రసాద్‌బాబు, రావిపాటి సాయికృష్ణ, గోళ్ల ప్రభాకర్‌, ఘంటసాల సోమశేఖర్‌, జాగర్లమూడి శ్రీనివాసరావు, తాడివాక సుబ్బారావు, ఎస్‌ఎస్‌పి జాదా, గుడిమెట్ల దయారత్నం, జవ్వాది సురేష్‌, హఫీజ్‌, చిలకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-03T05:10:51+05:30 IST