పజలపై పన్నుల భారం సరికాదు

ABN , First Publish Date - 2021-07-08T06:13:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన

పజలపై పన్నుల భారం సరికాదు
జీజీహెచ్‌ వద్ద ఆందోళన చేస్తున్న మృతుని తల్లిదండ్రులు

గుంటూరు(తూర్పు), జూలై7: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి, చెత్త పన్నుల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో బుధవారం పార్టీ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారం మోపడం సరికాదన్నారు. పన్నుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో పాటు, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు జేవీ రాఘవరావు, ఎం.రవి, భావన్నారాయణ, ఈమని అప్పారావు, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T06:13:06+05:30 IST