తానా సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-01-13T05:45:13+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవలు అభినందనీయమని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు.

తానా సేవలు అభినందనీయం
విద్యార్థులకు చెక్కులను అందిస్తున్న టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర తదితరులు

కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవలు అభినందనీయమని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ  ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులను గుర్తించి వారి పిల్లల విద్యాఖర్చుల నిమిత్తం తానా కార్యదర్శి పొట్లూరి రవి, మిత్రబృదం మూడునెలలలో దాదాపు వందమంది విద్యార్థులకు ఉపరకార వేతనాలు అందించింది. అందులో భాగంగా తన కార్యాలయంలో మంగళవారం గుంటూరుకు చెందిన విద్యార్థులు నాగశ్రీ, నిఖిల్‌, లోకాదిత్యలకు రూ.35వేలు అందించారు. కార్యక్రమంలో నూకవరపు బాలాజి  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:45:13+05:30 IST