రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2021-10-28T05:32:40+05:30 IST

కృష్ణానదిపై సత్రశాలలో నిర్మితమైన టెయిల్‌పాండ్‌ వద్ద రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగినట్లు చీఫ్‌ ఇంజనీర్‌(విద్యుత్‌సౌధ) సుజయ్‌కమార్‌ చెప్పారు.

రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
కేక్‌ కట్‌ చేస్తున్న సీఈ సుజయ్‌కుమార్‌,ఇంజనీర్ల బృందం

టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు సీఈ సుజయ్‌కుమార్‌

రెంటచింతల, అక్టోబరు 27: కృష్ణానదిపై సత్రశాలలో నిర్మితమైన టెయిల్‌పాండ్‌ వద్ద రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగినట్లు చీఫ్‌ ఇంజనీర్‌(విద్యుత్‌సౌధ) సుజయ్‌కమార్‌ చెప్పారు. బుధవారం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది అంకిత భావం పట్టుదల వల్లనే లక్ష్యాన్ని సాధించగలిగామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 90 ఎంయూల విద్యుత్‌ తయారు చేయాలని సీఈఏ(సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ అధారిటీ) లక్ష్యం నిర్దేశించగా ఐదు నెలలకు ముందుగానే అక్టోబరు 26 రాత్రికే 100.3776 మిలియన్‌ యూనిట్ల తయారు చేసి ఆల్‌టైం రికార్డును బద్దలు కొట్టామన్నారు. 2016 నుంచి ఇచ్చిన టార్గెట్‌ను అధిగమిస్తున్నామన్నారు. లక్ష్యాన్ని అధిగమించినందుకు సీఈ కేక్‌ కట్‌ చేసి సిబ్బందిని అభినంధించారు. ఈ కార్యక్రమంలో ఈఈలు రామకృష్ణ, శ్రీకాంత్‌, ఏడీఈలు వెంకట్రామిరెడ్డి, అంకన్న, నాగరాజు, రామంజనేయులు, నరసింహారావు, రాంప్రకాష్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T05:32:40+05:30 IST