ముగిసిన ధనుర్మాస మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-14T05:04:47+05:30 IST

తాడేపల్లి పట్టణజలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో త్రిదండి చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో బుధవారం గోదాదేవి, రంగనాఽథుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

ముగిసిన ధనుర్మాస మహోత్సవాలు
ఉత్సవమూర్తులకు పూజ చేస్తున్న చినజీయర్‌ స్వామి

తాడేపల్లి టౌన్‌, జనవరి 13: తాడేపల్లి పట్టణజలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో త్రిదండి చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో బుధవారం గోదాదేవి, రంగనాఽథుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్ర్తోక్తంగా అర్చకులు కల్యాణం నిర్వహించారు. అహోబిల జీయర్‌ స్వామి, జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యుల ఆధ్వర్యంలో పాసుర విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి జరిగాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా విచ్చేసి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. చినజీయర్‌ స్వామి వారికి మంగళశాసనాలు అందించారు. గత 29 రోజులుగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు ముగిశాయి. 

Updated Date - 2021-01-14T05:04:47+05:30 IST