వైసీపీ నేతల బెదిరింపులతోనే యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-01T05:19:19+05:30 IST

మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన మొలతాటి పీటర్‌(30) ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇనచార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేతల బెదిరింపులతోనే యువకుడి ఆత్మహత్య
మృతుడి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న డా చదలవాడ అరవిందబాబు

డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆరోపణ

నరసరావుపేట రూరల్‌, అక్టోబరు 31: మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన మొలతాటి పీటర్‌(30) ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇనచార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు డిమాండ్‌ చేశారు. పీటర్‌పాల్‌ కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. వైసీపీ నేతల బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పీటర్‌పాల్‌ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. తొలుత నరసరావుపేట వైద్యశాలలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్సకోసం గుంటూరు జీజీహెచకి తరలించగా ఆదివారం మృతి చెందాడు. కాగా గ్రామానికి చెందిన వైసీపీ నేతలు కొనతం రామకోటేశ్వరరావు, రాకింద పెదనాగేశ్వరరావు తమ కొడుకును చంపుతామని బెదిరించారని, ఇదే విషయం సూసైడ్‌నోట్‌ రాసి పీటర్‌పాల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి శాంతమ్మ ఫిర్యాదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తెలిపారు.  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.   


Updated Date - 2021-11-01T05:19:19+05:30 IST