బావిలో యువకుడి మృతదేహం

ABN , First Publish Date - 2021-03-14T05:50:30+05:30 IST

ఐదు రోజుల కిందట వాకింగ్‌కు అని వెళ్లిన యువకుడు శనివారం బావిలో శవమై కన్పించాడు.

బావిలో యువకుడి మృతదేహం
గాదె కృష్ణతేజ(ఫైల్‌ ఫోటో)

ఆత్మహత్య చేసుకున్నాడంటున్న కుటుంబసభ్యులు

ముప్పాళ్ళ, మార్చి 13: ఐదు రోజుల కిందట వాకింగ్‌కు అని వెళ్లిన యువకుడు శనివారం బావిలో శవమై కన్పించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాదె కృష్ణతేజ(20) ఇంటర్‌లో చేరి ఆ తర్వాత మానివేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా ఐదు రోజుల కిందట బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. పెదనందిపాడు కాలువ గట్టు పక్కనే ఉన్న కొబ్బరి తోట వద్ద ఉన్న బావిలో శనివారం యువకుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా కృష్ణతేజగా గుర్తించారు. అతని మొఖంపై బొల్లిమచ్చలు ఉండేవని, ఈ కారణంగా నూన్యతభావంతో ఉండేవాడని, దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు సుబ్బారావు, రమాదేవి తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంసత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నజీర్‌ బేగ్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-14T05:50:30+05:30 IST