స్థంభాలగరువు మహాప్రస్థానానికి రూ. లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-08-03T06:02:25+05:30 IST
స్థంభాలగరువు మహాప్రస్థానం అభివృద్ధికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ గల్లా కోటేశ్వరరావు, కోటేశ్వరి దంపతులు రూ. లక్ష విరాళం అందజేశారు.

గుంటూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): స్థంభాలగరువు మహాప్రస్థానం అభివృద్ధికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ గల్లా కోటేశ్వరరావు, కోటేశ్వరి దంపతులు రూ. లక్ష విరాళం అందజేశారు. బృందావన్‌గార్డెన్స్ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో సోమవారం మహాప్రస్థాన సేవా సమితి కోశాధికారి లంకా విజయసారధి, దాసరి హనుమంతరావులకు చెక్కు ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మన్నె సుబ్బారావు, పొగాకుబోర్డు సభ్యుడు యార్లగడ్డ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.