నేటి నుంచి దీపావళి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-11-01T05:22:24+05:30 IST

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లని గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది.

నేటి నుంచి దీపావళి ప్రత్యేక రైళ్లు

గుంటూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): దీపావళి పండగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లని గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. నెంబరు.07030 సికింద్రాబాద్‌ - అగర్తల ప్రత్యేక రైలు నవంబరు 1వ తేదీ సోమవారం సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు గుంటూరుకు వచ్చి గురువారం వేకువజామున 3 గంటలకు అగర్తల చేరుకొంటుంది. నెంబరు.07029 అగర్తల - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు 5వ తేదీ శుక్రవారం ఉదయం 6.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం గుంటూరుకు వచ్చి మధ్యాహ్నం 2.50కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. 

నెంబరు.08579 విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు 3, 10, 17 తేదీల్లో రాత్రి 7 గంటలకు బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ మీదగా మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు.08580 సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం ప్రత్యేక రైలు నవంబరు 4, 11, 18 తేదీల్లో రాత్రి 7.,40 గంటలకు బయలుదేరి గుంటూరు మీదగా మరసుటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. 

నెంబరు.07455 నరసపూర్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు 7, 14 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదగా మరుసటి రోజు వేకువజామున 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు.07456 సికింద్రాబాద్‌ - విజయవాడ ప్రత్యేక రైలు నవంబరు 1, 8, 15 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు వేకువజామున 5.50 గంటలకు విజయవాడ చేరుకొంటుంది. 


Updated Date - 2021-11-01T05:22:24+05:30 IST