కళాశాల విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ అలవాటు

ABN , First Publish Date - 2021-03-25T05:16:58+05:30 IST

కళాశాల విద్యార్థుల్లో సగం మంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు.

కళాశాల విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ అలవాటు
ప్రసంగిస్తున్న సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

గుంటూరు (సంగడిగుంట), మార్చి 24: కళాశాల విద్యార్థుల్లో సగం మంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. స్థానిక నల్లపాడులోని ఫ్యూచర్‌ ఫోకస్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఐదు కారణాల వల్లే మద్యం, హెరాయిన్‌, కొకైన్‌, బ్రౌన్‌ షుగర్‌, గంజాయి, టుబాకో వంటి మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారన్నారు. తోటివారి ఒత్తిడి, సామాజిక ప్రభావం, ఆందోళన, నిరాశ, అంతర్లీన మానసిక ఆరోగ్యసమస్యల వల్ల టీనేజ్‌ యువకులు మాదకద్రవ్యాలను ఉపయోగించడం ప్రారంభిస్తున్నారన్నారు. మాదకద్రవ్యాల వాడకం వలన మానసికస్థితిలో మార్పులు, జ్ఞాపకశక్తి మందగించడం, ఆలోచన శక్తి బలహీనపడటం, శ్వాసకోశ సమస్యలు, హృదయ స్పందన పెరగడం, మతిస్థిమితం కోల్పోవడం, నిరాశ, ఆందోళనలు పెరగడం వంటి లక్షణాలకు గురవుతున్నారన్నారు. 30శాతం కళాశాల విద్యార్థులు గంజాయిని ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలిందన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి డబ్బుకోసం నేరాలు చేయడానికి అలవాటు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీఐ వీరాస్వామి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-25T05:16:58+05:30 IST