జిల్లాలో నేటి నుంచి స్లాట్ బృందం పర్యటన
ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST
విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్ధ్యాలను పరిశీలించి పలు గుణాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు స్లాట్(సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రాన్సఫార్మేషన) బృందం సోమవారం నుంచి జిల్లాలో నాలుగు రోజులు పర్యటించనుందని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మేకతోటి వెంకటప్పయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గుంటూరు(విద్య), డిసెంబరు26: విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్ధ్యాలను పరిశీలించి పలు గుణాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు స్లాట్(సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రాన్సఫార్మేషన) బృందం సోమవారం నుంచి జిల్లాలో నాలుగు రోజులు పర్యటించనుందని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మేకతోటి వెంకటప్పయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బృందంలో జిల్లా కోఆర్డినేటర్‌గా బి.సాయిరాం వ్యవహరిస్తారు. పర్యటన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.