విదేశీ విద్య ఉపకార వేతనాలను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T05:14:32+05:30 IST
గత ప్రభుత్వంలో బకాయిలున్న విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాజావలి, ఇతర నాయకులు బుధవారం విజయవాడలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషాకు విజ్ఞప్తి చేశారు.

గుంటూరు, జనవరి 20: గత ప్రభుత్వంలో బకాయిలున్న విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాజావలి, ఇతర నాయకులు బుధవారం విజయవాడలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషాకు విజ్ఞప్తి చేశారు. 350 మంది మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని గత ప్రభుత్వం వారికి ఒకవిడత నిధులను విడుదల చేసిందని, మిగతా నిదులను విడుదల చేయాలని, 27 కోట్లు 50 లక్షల నిధులను విడుదల చేయాలని వారు కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కార్యక్రమంలో సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగుల్‌మీరా, ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలామ్, ఎస్‌ఎం బాషా తదితరులున్నారు.