మహిళలకు రోజూ పండుగే

ABN , First Publish Date - 2021-01-13T05:46:22+05:30 IST

ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు రోజూ పండుగేనని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

మహిళలకు రోజూ పండుగే
ముగ్గులు వేస్తున్న మహిళలు

మంత్రి తానేటి వనిత

ఘనంగా సంక్రాంతి సంబరాలు


పెదకూరపాడు, జనవరి 12: ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు రోజూ పండుగేనని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని బలుసుపాడులో మంగళవారం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని జరిగిన బహుమతి పంపిణీ కార్యక్రమంలో ఆమె విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. మహిళలను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించటమే లక్ష్యంగా వైసీపీ పాలన జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు సతీమణి వసంతకుమారి, కలెక్టర్‌ ఆనంద్‌ శామ్యూల్‌ సతీమణి సుజాత, జీడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఎన్‌వీవీఎస్‌ వరప్రసాదు, పార్టీ జిల్లా నాయకులు కంచేటి సాయి, ఈదా సాంబిరెడ్డి, బత్తుల కోటేశ్వరరావు, కంకణాల శివాజి, బెల్లంకొండ మీరయ్య, బచ్చు హనుమంతరావు, రాయవరపు ఉమామహేశ్వరరావు, ఇరుకులపాటి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-13T05:46:22+05:30 IST