సంగం పాల విక్రయ ధర పెంపు

ABN , First Publish Date - 2021-03-31T05:11:11+05:30 IST

పాల సేకరణ ధర, డీజిల్‌, ప్యాకింగ్‌ మెటీరియల్‌ ధరలు..

సంగం పాల విక్రయ ధర పెంపు

చేబ్రోలు(గుంటూరు): పాల సేకరణ ధర, డీజిల్‌, ప్యాకింగ్‌ మెటీరియల్‌ ధరలు, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో అనివార్య పరిస్థితుల దృష్ట్యా సంగం బ్రాండ్‌ పాల ప్యాకెట్ల ధరలను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెంచనున్నట్లు సంగం డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణన్‌ మంగళవారం తెలిపారు. హోమోజినైజ్డ్‌ ఫుల్‌ క్రీమిల్క్‌ (గోల్డ్‌ ప్లేస్‌) 500 మి.లీ. ధర ప్రస్తుతం రూ.30 ఉండగా 1వ తేదీ నుంచి రూ.31 గా పెంచి విక్రయించనున్నట్లు చెప్పారు. ఫాశ్చరైజ్డ్‌ ఫుల్‌క్రీమ్‌ మిల్క్‌(గోల్డ్‌ ప్లస్‌) ప్యాకెట్‌ ధర రూ.30 నుంచి రూ31కి, హోమోజినైజ్డ్‌ ఫుల్‌క్రీమ్‌ మిల్క్‌ (గోల్డ్‌) ప్యాకెట్‌ ధర రూ.29 నుంచి రూ.30కు, ఫాశ్చరైజ్డ్‌ ఫుల్‌క్రీమ్‌ మిల్క్‌ (గోల్డ్‌) ప్యాకెట్‌ ధర రూ.29 నుంచి రూ.30కి, హోమోజినైజ్డ్‌ ఫుల్‌క్రీమ్‌ మిల్క్‌ (టీ స్పెషల్‌) రూ.28 నుంచి రూ.29కి, ఎస్టీఎం (ప్రీమియం) ధర రూ.26 నుంచి రూ.27కు పెంచామన్నారు. టోన్డ్‌ మిల్క్‌ రూ.24 నుంచి రూ.25 పెరిగింది. డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ రూ.22 నుంచి రూ.23కు పెరిగింది. ప్రస్తుతం 500 మిల్లీ లీటర్ల పాల ప్యాకెట్లు ధర మాత్రమే పెంచామని మిగిలిన పాలు, పాల ఉత్పత్తుల ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఎండీ గోపాలకృష్ణన్‌ తెలిపారు.

Updated Date - 2021-03-31T05:11:11+05:30 IST