సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2021-11-03T05:05:08+05:30 IST

నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 589.80 అడుగులు ఉంది. ఇది 311.44 టీఎంసీలకు సమానం.

సాగర్‌ నీటి సమాచారం
క్రస్ట్‌గేట్‌ ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత, నవంబరు 2: నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 589.80 అడుగులు ఉంది. ఇది 311.44 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 9,443, ఎడమకాలువ ద్వారా 5,226, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 32,784, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800, ఒక క్రస్ట్‌గేట్‌ను ఐదు అడుగుల మేర ఎత్తి 8,090 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 57,323 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇనఫ్లో వాటర్‌గా 57,323 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 870.40 అడుగులుంది. ఇది 143.41 టీఎంసీలకు సమానం. 

ప్రకాశం బ్యారేజి దిగువకు.. 

 తాడేపల్లి టౌన్‌: ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు ఎగువున్న వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి 58,800 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 6,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 70 గేట్లను 


 అడుగు వంతున ఎత్తి 52,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

 

Updated Date - 2021-11-03T05:05:08+05:30 IST