చారిత్రక సంపదను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-06-21T05:46:33+05:30 IST

మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన చారిత్రక వారసత్వ సంపదను రక్షించి భావి తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని పేర్కొన్నారు.

చారిత్రక సంపదను కాపాడుకోవాలి
ఘాట్‌రోడ్డు పక్కన ఇటీవల బయల్పడిన దిగుడుబావిని పరిశీలిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని

రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని

యడ్లపాడు, జూన్‌ 20: మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన చారిత్రక వారసత్వ సంపదను రక్షించి భావి తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని పేర్కొన్నారు. మండలంలోని చారిత్రక ప్రాంతమైన కొండవీడుకోటను ఆదివారం ఎస్పీ కుటుంబసభ్యులతో కలసి సందర్శించారు. కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి కొండవీడుకోట చరిత్రను, కట్టడాల విశిష్టతలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ  అనంతరం శివారెడ్డి కొండవీటి చరిత్ర వ్యాసాలు అనే గ్రంఽథాన్ని ఎస్పీకి అందజేశారు. ఎస్పీ వెంట నరసరావుపేట డీఎస్పీ భాస్కరరావు, నరసరావుపేట రూరల్‌ సీఐ అచ్చయ్య, రూరల్‌ ఎస్‌ఐ శ్రీహరి, కొత్తపాలెం సర్పంచ్‌ మలమంటి వెంకటసుబ్బారావు తదితరులు ఉన్నారు. 

అదేవిధంగా కొండవీడుకోట ప్రాంతాన్ని గుంటూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం సందర్శించారు. కల్లి శివారెడ్డి కొండలపై ఉన్న కట్టడాలు, వాటి విశిష్టతలను ఆర్డీవో దంపతులకు వివరించారు. అనంతరం రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు. 

Updated Date - 2021-06-21T05:46:33+05:30 IST