ఆర్టీసీ ఆర్‌ఎంగా విజయగీత బాధ్యతలు స్వీకారం

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌గా విజయగీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆర్టీసీ ఆర్‌ఎంగా విజయగీత బాధ్యతలు స్వీకారం
ఆర్‌ఎం విజయగీతకు స్వాగతం పలుకుతున్న డిప్యూటీ సీటీఎం రాజశేఖర్‌

గుంటూరు, అక్టోబరు 25: ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌గా విజయగీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఆర్‌ఎంగా పనిచేసిన ఎస్టీపీ రాఘవకుమార్‌ విజయవాడలోని చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌ విభాగం ఇన్‌చార్జిగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా ఆర్‌ఎంగా ఉన్న విజయగీతను నియమించారు. గుంటూరు ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమె అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు, సలహాలు చేశారు. ఆర్‌ఎం మాట్లాడుతూ రీజియన్‌లో ప్రయాణికులకు ఆర్టీసీ సర్వీసులను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను నరసరావుపేట డిప్యూటీ సీటీఎం రాజశేఖర్‌, డిప్యూటీ సీఎంఈ శరతబాబు, గుంటూరు -2 డీఎం మల్లికార్జునరెడ్డి, ఏటిఎం శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.  

Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST