బ్లాక్‌మార్కెట్‌కు రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-07-08T06:29:11+05:30 IST

నగరంలోని ఆర్‌టీసీ కాలనీ శివారులో ఉన్న షాపు ఎంప్లాయీస్‌ కాలనీ నాల్గో లైనులో ఉన్న నెంబరు. 0781179 రేషన్‌ దుకాణంలో బియ్యం, కందిపప్పు, పంచదార నిల్వలు మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.

బ్లాక్‌మార్కెట్‌కు రేషన్‌ బియ్యం
షాపు ఎంప్లాయీస్‌ కాలనీలో రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేస్తోన్న పౌరసరఫరాల శాఖ అధికారులు

డీలర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్‌టీసీ కాలనీ శివారులో ఉన్న షాపు ఎంప్లాయీస్‌ కాలనీ నాల్గో లైనులో ఉన్న నెంబరు. 0781179 రేషన్‌ దుకాణంలో బియ్యం, కందిపప్పు, పంచదార నిల్వలు మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. బుధవారం డిప్యూటీ తహసీల్దార్‌ షేక్‌ జియావుల్‌ హక్‌, వీఆర్‌వో నాగేశ్వరరావు ఆకస్మికంగా రేషన్‌ షాపుని తనిఖీ చేశారు. ఈ-పోస్‌ రిజిస్టర్‌ ప్రకారం షాపులో 34.50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం, 97 కేజీల చక్కెర, 97 కేజీల కందిపప్పు నిల్వలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఆయా సరుకులను డీలర్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలించారని తమ విచారణలో నిర్ధారణ జరిగినట్లు డీటీ తెలిపారు. దీనిపై డీలర్‌ బండ్లమూడి ఉమాదేవిపై జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో 6ఏ కేసు, క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాల్లో రేషన్‌ బియ్యం తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-07-08T06:29:11+05:30 IST