ప్రథమ చికిత్సపై అవగాహన కలిగిఉండాలి
ABN , First Publish Date - 2021-12-09T05:45:34+05:30 IST
ప్రథమ చికిత్సలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్‌ఎస్‌ఎల్ యడ్లపాడు యూనిట్ హెడ్ సాంబశివరావు అన్నారు.

గుంటూరు(తూర్పు), డిసెంబరు8: ప్రథమ చికిత్సలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్‌ఎస్‌ఎల్ యడ్లపాడు యూనిట్ హెడ్ సాంబశివరావు అన్నారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బుధవారం యూనిట్‌లో పనిచేసే కార్మికులకు ప్రథమచికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై అవగాహన ఉంటే ప్రాణాలకు కాపాడుకోవచ్చన్నారు. రెడ్‌క్రాస్ రీజనల్ కో ఆర్డినేటర్ మంగమ్మ మాట్లాడుతూ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయదలచిన పరిశ్రమల యజమానులు 9100819588 అనే నెంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఫీల్డ్ అధికారి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, జెన్నా తదితరులు పాల్గొన్నారు.