రీసర్వేతో రైతులందరికీ భూ హక్కు

ABN , First Publish Date - 2021-01-13T05:47:44+05:30 IST

రాష్ట్రంలోని భూ యజమానులకు ప్రభుత్వ గ్యారంటీతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూ హక్కు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం భూముల రీసర్వే చేయిస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సలహాదారు నీలం సాహ్ని అన్నారు.

రీసర్వేతో రైతులందరికీ భూ హక్కు
అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీలం సాహ్ని

ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సలహాదారు నీలం సాహ్ని


ప్రత్తిపాడు, జనవరి 12: రాష్ట్రంలోని భూ యజమానులకు ప్రభుత్వ గ్యారంటీతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూ హక్కు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం భూముల రీసర్వే చేయిస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సలహాదారు నీలం సాహ్ని అన్నారు. మండలంలోని కొండజాగర్లమూడిలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని మంగళవారం ఆమె ల్యాండ్‌ రికార్డ్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌తో కలిసి పరిశీలించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్‌ యాక్టు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించడం జరిగిందన్నారు. సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి రీ సర్వే చేస్తున్నామని, మూడు విడతల్లో రాష్ట్రం మొత్తం సర్వే చేయడం జరుగుతుందన్నారు.    కార్యక్రమంలో జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి, ఆర్‌డీడీ ఖజియా బేగం, డీపీవో కొండయ్య, డిప్యూటీ కలెక్టర్‌ డేవిడ్‌రాజు, జిల్లా ల్యాండ్‌ సర్వే ఏడీ చలపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:47:44+05:30 IST