ప్రజా చైతన్య కాంతులు .. రావి కవితలు
ABN , First Publish Date - 2021-02-14T06:03:40+05:30 IST
ప్రజా చైతన్య కాంతులు డాక్టర్ రావి రంగారావు కవితలు అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సూర్యదేవర రవికుమార్ తెలిపారు.
గుంటూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి13: ప్రజా చైతన్య కాంతులు డాక్టర్ రావి రంగారావు కవితలు అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సూర్యదేవర రవికుమార్ తెలిపారు. స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రావి రంగారావు సాహిత్య పీఠం ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ రావి రంగారావు కవితల సంపుటి కొత్త సూరీళ్లు మొలిచితీరాలి గ్రంథావిష్కరణ సభ జరిగింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మైలవరపు లలితకుమారి అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్ బీరం సుందరరావు గ్రంఽథ సమీక్ష చేశారు. సభలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సంస్థ కన్వీనర్ నర్రా ప్రభావతి, పింగళి భాగ్యలక్ష్మి, కొల్లూరు నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.