మంత్రి వ్యాఖ్యలు సమంజసం కాదు
ABN , First Publish Date - 2021-10-28T05:49:58+05:30 IST
రేషన్ డీలర్ల సమ్మెపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు తెలిపారు.

రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు
తెనాలి అర్బన్, అక్టోబరు 27: రేషన్ డీలర్ల సమ్మెపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు తెలిపారు. బుధవారం ఆయన తెనాలిలో విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. డీలర్లు సమ్మె చేస్తే ఏం చేయాలో తమకు తెలుసంటూ మాట్లాడటం తగదన్నారు. రేషన్ దుకాణాలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, మంత్రి పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సింది పోయి బెదిరింపు దోరణితో వ్యవహరించడం శోచనీయమన్నారు. వెంటనే డీలర్లతో చర్చించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.