అమరావతితోనే రాష్ట్ర ప్రగతి

ABN , First Publish Date - 2021-12-27T05:24:54+05:30 IST

అమరావతి రాజధాని అభివృద్ధిని నిలిపివేసి రైతులకు, రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని రాజధాని రైతులు పేర్కొన్నారు.

అమరావతితోనే రాష్ట్ర ప్రగతి
పెదపరిమి శిబిరంలో ఆందోళనలు చేస్తున్న రైతులు

 740వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, డిసెంబరు 26: అమరావతి రాజధాని అభివృద్ధిని నిలిపివేసి రైతులకు, రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని రాజధాని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం 740వ రోజుకు చేరుకుంది. ఆదివారం ధర్నా శిబిరాల్లో మాట్లాడుతూ అమరావతిని స్వాగతిస్తున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి సీఎం జగన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన తరువాత అమరావతిపై కక్ష కట్టి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. పాలకులు మారినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్పులు చేసుకుంటూ పోతే ఏపీకి కేరాఫ్‌ అడ్రస్‌ ఉండదన్నారు. జగన్‌రెడ్డి నిర్ణయాలతో ఇప్పటికే పక్క రాష్ట్రాల వారికి చులకనె ౖపోయామన్నారు. అమరావతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. న్యాయం తమ వైపు ఉందన్నారు. వేలమంది రైతులను అన్యాయం చేస్తుంటే న్యాయదేవత చూస్తూ ఉండదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం  కొనసాగింది. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 


Updated Date - 2021-12-27T05:24:54+05:30 IST