ప్రజాస్వామ్యమా.. నియంత పాలనా

ABN , First Publish Date - 2021-05-19T05:15:12+05:30 IST

ప్రశ్నిస్తే కేసులు.. ధర్మ పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు.. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామో అర్థం కావటం లేదని రైతులు తెలిపారు.

ప్రజాస్వామ్యమా.. నియంత పాలనా
మోతకడలో నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలు, రైతులు

ప్రజానేతలు, మీడియాపై అక్రమ కేసులు 

518వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు ధ్వజం


తుళ్లూరు, తాడికొండ, మే 18:  ప్రశ్నిస్తే కేసులు..  ధర్మ పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు.. అసలు ఇది ప్రజాస్వామ్యంలో

ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామో అర్థం కావటం లేదని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 518 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతుల పక్షాన నిలబడే మీడియాపై,  ప్రజానేతలపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాస్తుందని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా సీఎం జగన్‌రెడ్డి నియంత ధోరణి వీడటం లేదన్నారు.  అభివృద్ధి కాదు గ్రాఫిక్స్‌ అంటూ నమ్మించాలని చూస్తే అది తరగబడిందన్నారు. రాజధాని రైతులకు చేసే అన్యాయంపై  సీఎం జగన్‌రెడ్డిని ఉన్నత న్యాయస్థానాలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.   ఇంటింట అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. రాజధాని 29 గ్రామాలలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగించారు. 


Updated Date - 2021-05-19T05:15:12+05:30 IST