రాజధానిపై బొత్స వ్యాఖ్యలు అర్ధరహితం

ABN , First Publish Date - 2021-05-02T05:48:39+05:30 IST

దళితుల రాజధాని అమరావతిపై నోరు జారితే తీవ్ర పరిణామాలుంటాయని రాజధాని అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ మండిపడ్డారు.

రాజధానిపై బొత్స వ్యాఖ్యలు అర్ధరహితం

 రాజధాని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌

తుళ్లూరు, మే 1: దళితుల రాజధాని అమరావతిపై నోరు జారితే తీవ్ర పరిణామాలుంటాయని రాజధాని అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసలు మంత్రి బొత్స సత్యనారాయణకు రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఐదొందలు కాకపోతే వెయ్యి రోజులు పండగ చేసుకోండని అమరావతి ఉద్యమం గురించి వ్యగ్యంగా మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. రాజధానికి భూములిచ్చినవారిలో దళితులే అధిక శాతం ఉన్నారని తెలిపారు. మీరు మాట్లాడేది ప్రజలకు అర్ధం కాదు.. మీకైనా అర్ధం అవుతుందా అని ఎద్దేవా చేశారు. అధికారం చూసుకొని కండకావరంతో మాట్లాడవద్దని రాజధాని దళిత జేఏసీ తరఫున హెచ్చరించారు. 

Updated Date - 2021-05-02T05:48:39+05:30 IST