కూరగాయల రైతులకు రాయితీలు

ABN , First Publish Date - 2021-10-25T05:39:05+05:30 IST

కూరగాయలు సాగు చేసే రైతులకు చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తుందని హార్టికల్చర్‌ ఏడీ రాజాకృష్ణారెడ్డి తెలిపారు.

కూరగాయల రైతులకు రాయితీలు
సమావేశంలో ప్రసంగిస్తున్న ఏడీ రాజాకృష్ణారెడ్డి

వట్టిచెరుకూరు, అక్టోబరు 24: కూరగాయలు సాగు చేసే రైతులకు చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తుందని హార్టికల్చర్‌ ఏడీ రాజాకృష్ణారెడ్డి తెలిపారు. పుల్లడిగుంట సమీపంలోని రైతు నేస్తం ఫౌండేషన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం  రాయితీల మొత్తాన్ని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాకృతిక రైతు మీసాల రామకృష్ణ, రైతు నేస్తం ఫౌండేషన సీఈవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-25T05:39:05+05:30 IST