15 రైల్వే గేట్ల మూత..

ABN , First Publish Date - 2021-08-26T05:19:31+05:30 IST

ఇప్పటి వరకు కాపలా దారు లేని రైల్వేగేట్ల తొలగింపుపై దృష్టి పెట్టిన రైల్వే శాఖ ఇప్పుడు కాపలాదారులు ఉన్న గేట్లని శాశ్వ తంగా మూసివేసే దిశగా చర్యలు చేపట్టింది.

15 రైల్వే గేట్ల మూత..

శాశ్వతంగా తొలగించనున్న రైల్వే 

ఇప్పటికే కాపాలాదారులు లేనివి బంద్‌

కాపలాదారులున్న గేట్లపై అధికారుల దృష్టి 

రూ.72.15 కోట్ల అంచనాతో సబ్‌వేల నిర్మాణం

త్వరలో టెండర్లు ఖరారు చేయనున్న రైల్వే శాఖ 


గుంటూరు, ఆగస్టు 25 (ఆంధ్ర జ్యోతి): ఇప్పటి వరకు కాపలా దారు లేని రైల్వేగేట్ల తొలగింపుపై దృష్టి పెట్టిన రైల్వే శాఖ ఇప్పుడు కాపలాదారులు ఉన్న గేట్లని శాశ్వ తంగా మూసివేసే దిశగా చర్యలు చేపట్టింది. గుంటూరు రైల్వే డివి జన్‌ పరిధిలో మొత్తం 15 గేట్లను గుర్తించింది. అక్కడ సబ్‌వేలను నిర్మించేందుకు నిర్ణయించింది. త ద్వారా సిబ్బంది సంఖ్యని తగ్గించు కునేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇంచుమించు రూ.72 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయ నున్నది. ఇప్పటికే టెండర్లను పిలి చిన రైల్వే శాఖ కొద్ది రోజుల్లోనే వా టిని ఖరారు చేసి సబ్‌వేల నిర్మాణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. రైల్వే శాఖ దశల వారీగా సిబ్బంది సంఖ్యని తగ్గిం చుకొంటోన్న విషయం తెలిసిందే. గతంలో కాపలాదారు లేని రైల్వే గేట్ల వద్ద కూడా కాంట్రాక్టు పద్ధతి న సిబ్బందిని నియమించి పర్య వేక్షించేవారు. ఇప్పుడు కాపలా ఉన్న గేట్లని కూడా తొలగించు కుంటూ పోతున్నారు. గుంటూరు - కృష్ణ కెనాల్‌ జంక్షన్‌ మధ్యన 5 చోట్ల సబ్‌వేల నిర్మాణం చేపట్టను న్నారు. లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల నెం బర్లు. 6, 7, 11, 17 ఏ, 17 బీ వద్ద సబ్‌వేల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.27 కోట్ల 50 లక్షలను రైల్వే శాఖ మంజూరు చేసింది. ఇదేవిధంగా గుంటూరు - నడికుడి మధ్య ఆరు చోట్ల సబ్‌ వేల నిర్మాణం చేపట్టనున్నది. బం డారుపల్లి - సిరిపురం, సత్తెనపల్లి - రెడ్డిగూడెం, రెడ్డిగూడెం - బెల్లం కొండ, బెల్లంకొండ - పిడుగురాళ్ల, పిడుగురాళ్ల-తుమ్మలచెరువు మధ్య మొత్తం ఆరు సబ్‌వేలు, నడికుడి - బీబీనగర్‌ సెక్షన్‌లో మరో సబ్‌ వే మంజూరైంది. వీటి కోసం రూ. 29.59 కోట్లని రైల్వే శాఖ పరి పా లన అనుమతిఇచ్చింది. నల్లపాడు - నంద్యాల సెక్షన్‌లో పేరేచర్ల - ఫిరంగిపురం, వినుకొండ - చీకటీగలపాలెం, సంతమాగులూ రు- శాశల్యాపురం మధ్య మూడు ఆర్‌యూబీలను రూ. 15.05 కోట్ల అంచనాతో నిర్మిం చనున్నారు.


నరకం చూపుతున్న సబ్‌వేలు

ఇప్పటికే రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించిన సబ్‌వేల నిర్వహణ లోపంతో వాహన చోదకులకు నర కం చూపుతున్నాయి. వర్షం కురి స్తే డ్రెయినేజీ నీరు అంతా సబ్‌ వేల్లో చేరి నిలిచిపోతుంది. రోజుల బడి వాహనాల రాకపోకలు ఆటం కాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థి తుల్లో మళ్లీ అలాంటివే కొత్తగా సబ్‌వేలు 15 నిర్మించనున్నట్లు తెలిసి ఆయా మార్గాల్లో రాకపోక లు సాగించే వాహనదారులు భ యపడుతున్నారు. ప్రధానంగా రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల మార్గం లో నుంచే రైతులు తమ వ్యవ సాయ ఉత్పత్తులు, ఎరువులు, పు రుగు మందులను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై రవాణా చేస్తుంటారు. సబ్‌ వేల నిర్మాణం వల్ల పరిమిత ఎత్తులో వాహనాలు మాత్రమే ప్ర యాణానికి అనుమతి ఉంటుంది. దీంతో ట్రాక్టర్లు వంటివి వేరే మా ర్గంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. అలానే సబ్‌వేల కింద నిలిచే మురుగునీటిని తొలగించా ల్సిన బాధ్యత తమది కాదని రైల్వే వర్గాలు తప్పుకొంటున్నాయి. సం బంధిత మునిసిపల్‌, పంచాయ తీరాజ్‌ అధికారులు చూసుకోవా ల ని చెబుతున్నాయి. ఎక్కడో ఊరు బయట ఉండే ఈ సబ్‌వేల వద్దకు వెళ్లి పారిశుధ్య కార్మికులు పని చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యం లో కొత్తగా నిర్మించబోయే సబ్‌వేల వద్దనైనా తగిన డ్రెయి నేజీ వ్యవ స్థని ఏర్పాటు చేసి వర్షం నీరు నిలవకుండా చూడాలని ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహన దారులు కోరుతున్నారు. 



Updated Date - 2021-08-26T05:19:31+05:30 IST