రైలు కిందపడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-02-07T05:25:06+05:30 IST
పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వేగేటు సమీపంలో గూడ్సు రైలు కిందపడి శనివారం గోకనకొండకు చెందిన మొగిలి గురుస్వామి (35) మృతి చెందాడు.

వినుకొండటౌన్, ఫిబ్రవరి 6: పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వేగేటు సమీపంలో గూడ్సు రైలు కిందపడి శనివారం గోకనకొండకు చెందిన మొగిలి గురుస్వామి (35) మృతి చెందాడు. మానసిక స్థితి సరిగా లేక అతను రైలుకింద పడినట్లు నరసరావుపేట రైల్వేపోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.