నరసింహస్వామికి స్వర్ణ కవచం సమర్పణ
ABN , First Publish Date - 2021-05-22T04:44:12+05:30 IST
స్థానిక ఆర్‌అగ్రహారం శ్రీరాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామికి శుక్రవారం సుమారు రూ.6లక్షలు విలువ కలిగిన స్వర్ణ వక్షస్థల కవచాన్ని చెరుకూరి శ్రీనివాసరావు దంపతులు సమర్పించారు.

గుంటూరు(సాంస్కృతికం), మే 21: స్థానిక ఆర్‌అగ్రహారం శ్రీరాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామికి శుక్రవారం సుమారు రూ.6లక్షలు విలువ కలిగిన స్వర్ణ వక్షస్థల కవచాన్ని చెరుకూరి శ్రీనివాసరావు దంపతులు సమర్పించారు. వేదపండితులు నంద్యాల శ్రీనివాసరావు స్వర్ణ వక్షస్థల కవచానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.మాధవీదేవికి స్వర్ణకవచాన్ని అందజేశారు.