గాంధీజీ దంపతుల విగ్రహాలు తొలగించటం దారుణం

ABN , First Publish Date - 2021-08-25T05:59:31+05:30 IST

స్థానిక కొత్తపేటలోని పెద్ద మహాలక్ష్మమ్మ ఆలయం పక్కన దశాబ్దాలుగా ఉన్న గాంధీజీ దంపతుల విగ్రహాలను తొలగించటం దుర్మార్గం అని టీడీపీ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ అన్నారు.

గాంధీజీ దంపతుల విగ్రహాలు తొలగించటం దారుణం
గాంధీజీ దంపతుల విగ్రహాలను పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ బాబు, టీడీపీ నాయకులు

యధా స్థానంలో పెట్టాలని టీడీపీ డిమాండ్‌

గుంటూరు, ఆగస్టు 24: స్థానిక కొత్తపేటలోని పెద్ద మహాలక్ష్మమ్మ ఆలయం పక్కన దశాబ్దాలుగా ఉన్న గాంధీజీ దంపతుల విగ్రహాలను తొలగించటం దుర్మార్గం అని టీడీపీ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ అన్నారు.  మిర్చి యార్డు మాజీ ఉపాధ్యక్షుడు కొత్తూరి వెంకట్‌, గుంటూరు పార్లమెంటు టీడీపీ కోశాధికారి కనకళ్ల సత్యం, 6వ డివిజన టీడీపీ అధ్యక్షుడు గుంటూరు వెంకటేష్‌, పార్టీ నాయకులు పెండ్యాల విజయ్‌కుమార్‌ తదితరులతో కలిసి ఆయా విగ్రహాలను పరిశీలించారు. నగరపాలక సంస్థ స్థలంలో దుకాణం నిర్మిస్తున్న వారు ఏకంగా ప్రభుత్వ స్థలంలో ఉన్న విగ్రహాలను ఎలా మారుస్తారని వారు ప్రశ్నించారు. తక్షణం యధావిధి స్థానంలో విగ్రహాలను ఉంచాలని వారు డిమాండ్‌ చేశారు. 

   

Updated Date - 2021-08-25T05:59:31+05:30 IST