ఆక్రమణల తొలగింపుపై బాధితుల ఆగ్రమం

ABN , First Publish Date - 2021-12-08T05:23:09+05:30 IST

అన్యాయంగా తమ ఇళ్లను కూలగొడుతున్నారంటూ పెదవడ్లపూడిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్రమణల తొలగింపుపై బాధితుల ఆగ్రమం
పెదవడ్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు

మంగళగిరి, డిసెంబరు 7: అన్యాయంగా తమ ఇళ్లను కూలగొడుతున్నారంటూ పెదవడ్లపూడిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా మంగళగిరి నగరపాలకసంస్థలో విలీనమైన పెదవడ్లపూడిలో రోడ్ల వెంబడివున్న ఆక్రమిత నివాసాలను మంగళవారం జేసీబీలతో అధికారులు తొలగింపజేశారు. గ్రామంలోని శివాలయం సెంటరుతోపాటు స్టేషన్‌రోడ్డు, పరిసర వీధుల్లోని ఆక్రమణలను కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు మంగళవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం.. ఇప్పుడొచ్చి ఆక్రమణలని చెబుతున్నారు... ఆక్రమణలైతే మాకు వేరేచోట స్థలాలిచ్చి ఇళ్లు కట్టించి మమ్మల్ని ఖాళీ చేయించాలి అని అన్నారు. టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్‌చంద్‌, మాదల రమేష్‌ తదితరులు నిరసనకు మద్దతుగా పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:23:09+05:30 IST