పనిభారం తగ్గించండి సార్‌

ABN , First Publish Date - 2021-11-24T05:23:13+05:30 IST

పేరుకు వలంటీరు హెల్త్‌వర్కర్లు అయినప్పటికీ ఇతర పనుల్లో కూడా తమకు విఽధులు కేటాయిస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పనిభారం తగ్గించండి సార్‌
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఆశావర్కర్లు

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆశాల నిరసన

గుంటూరు(తూర్పు), నవంబరు 23 : పేరుకు వలంటీరు హెల్త్‌వర్కర్లు అయినప్పటికీ ఇతర పనుల్లో కూడా తమకు విఽధులు కేటాయిస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆశాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన జిల్లా గౌరవాధ్యక్షుడు వై నేతాజీ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. 10 వేలు వేతనం ఇస్తున్నామనే పేరుతో సంక్షేమ పథకాలు కుదించడం, రెగ్యులర్‌ విధులకు సంబంధం లేని పనులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. యూనియన జిల్లా ప్రఽధాన కార్యదర్శి డి శివకుమారి మాట్లాడుతూ ఆశావర్కర్లుతో  కొవిడ్‌ వ్యాక్సినబాక్సులు మోయించడం  సరికాదన్నారు. ఇచ్చే రూ. 10 వేలు సరిగా ఇవ్వడంలేదన్నారు. వాటిలో రూ.3 వేలు ప్రయాణ ఖర్చులు కిందకే పోతున్నాయని మిగిలిన వాటితో కుటుంబపోషణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తక్షణమే పనిభారం తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన నాయకులు జ్యోతి, వీణాదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:23:13+05:30 IST