గత పాలకుల అసమర్థతతోనే ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
ABN , First Publish Date - 2021-07-08T19:05:14+05:30 IST
గత పాలకుల అసమర్థతతోనే..

ఎమ్మెల్యేకిలారి వెంకటరోశయ్య
పొన్నూరు: గత పాలకుల అసమర్థతతోనే ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురయ్యాయని, పలు ప్రాంతాల్లో కాల్వలపై కట్టడాలు వెలిశాయని ఎమ్మెల్యేకిలారి వెంకటరోశయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సచివాలయాల, మున్సిపల్ సిబ్బందితో ఆయనసమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రత్యేక సర్వే నిర్వహించి మున్సిపాలిటి స్థలాల్లోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలను తొలగించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కాల్వలపై ఇళ్ల నిర్మాణం చేశారని తద్వారా మురుగునీరు పారుదల లేక కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి ప్రాంతాను గుర్తించి వాటిని ఖాళీ చేయించి, అర్హులైనవారికి నివేశన స్థలాల పట్టాలు అందచేయాలని ఆయన సూచించారు. అక్రమ నిర్మాణాలు జరిపే సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణలు గుర్తించి వాటిని నిలుపుదల చేస్తే భవిష్యత్తులో సమస్యలు తెలెత్తవని ఇటువంటి ఆంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మురుగునీరు బయటకు వెళ్ళే మెయిన్ డ్రెయిన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంతకు ముందు గుడ్‌మార్నింగ్ పొన్నూరు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య పట్టణంలోని 1, 2, 3 వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దొడ్డాకుల పద్మనాభుడు, మున్సిపల్ డిఈఈ శ్రీనివాసరావు, టిపివో కె వెంకటేశ్వరరావు, మేనేజరు సుబ్బారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీపతిరావు, నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, అబ్దుల్‌నాజర్, నాగసూరిప్రతాప్‌కుమార్, వాసు, అంబటి వెంకటేశ్వరావు, అమిరినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.