19 మందికి కారుణ్య నియామకాలు
ABN , First Publish Date - 2021-10-30T04:47:26+05:30 IST
ప్రభుత్వ ఆదేవాల మేరకు జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉద్యోగాన్ని కల్పించారు.
గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేవాల మేరకు జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉద్యోగాన్ని కల్పించారు. మొత్తం 19 మందికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇటీవలకాలంలో 33 మంది ఉద్యోగులు చనిపోగా వారి కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొన్నారని చెప్పారు. మిగతా 12 మందికి మరోసారి నిర్వహించే కారుణ్య నియామకాల ఎంపిక ప్రక్రియలో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కొండయ్య, కలెక్టరేట్ ఏవో తాతా మోహన్‌రావు, సూపరింటెండెంట్ పీటర్, జానకి పాల్గొన్నారు.