31న పోలీసులకు శాఖాపరమైన పరీక్షలు
ABN , First Publish Date - 2021-07-24T05:41:11+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ పోలీసులకు ఈనెల 31న శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఎస్పీ
గుంటూరు, జూలై 23: గ్రామ, వార్డు సచివాలయ పోలీసులకు ఈనెల 31న శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం టీజేపీఎస్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. మహిళా పోలీసులు పరీక్షా కేంద్రంలోకి నిర్ధేశించిన సమయానికి ముందే చేరుకోవాలన్నారు. ఈ పరీక్షలకు అర్బన్ దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ అడ్మిన్ అదనపు ఎస్పీ దిశాంత్‌రెడ్డి, దిశ డీఎస్పీ రవికుమార్, జిల్లా శిక్షణ కేంద్రం సీఐలు సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.