పోలీసు క్రీడా పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-19T05:37:23+05:30 IST

అర్బన్‌ పోలీస్‌ క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

పోలీసు క్రీడా పోటీలు ప్రారంభం
వాలీబాల్‌ పోటీలు ప్రారంభిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌

గుంటూరు, డిసెంబరు 18: అర్బన్‌ పోలీస్‌ క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. పోలీసు క్రీడా మైదానంలో అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ పచ్చజెండా  ఊపి ప్రారంభించారు. తొలుత క్రీడాజ్యోతి వెలిగించిన అర్బన్‌ ఎస్పీ క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులు మైదానంలో క్రీడా మారథాన్‌ నిర్వహించారు.  శనివారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఈ  ఓటీల్లో కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌జంప్‌,  జావలిన్‌త్రో, 100, 200, 400, 800 పరుగు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలు త్వరలో జరిగే రేంజ్‌ పోటీలకు ఎంపికవుతారని అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుం రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో పోలీసు క్రీడా పోటీలు జరుగుతున్నాయన్నారు. పోటీలకు అర్బన్‌ నుంచి ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌,సౌత్‌, ట్రాఫిక్‌, ఏఆర్‌ విభాగాల నుంచి  జట్లు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు చక్రవార్తి, గంగాధరంతోపాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, క్రీడాకారులు హాజరయ్యారు.

Updated Date - 2021-12-19T05:37:23+05:30 IST