విద్యాసంస్థలు, హాస్టళ్ల వద్ద పెట్రోలింగ్‌

ABN , First Publish Date - 2021-08-26T04:41:19+05:30 IST

విద్యా సంస్థలు, హాస్టళ్ల వద్ద పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన రమ్య హత్య నేపథ్యంలో నగరంలోని విద్యా సంస్థలతోపాటు వర్కింగ్‌ హాస్టల్స్‌ వద్ద మఫ్టీలో మహిళా పోలీసులు తిరుగుతున్నారు.

విద్యాసంస్థలు, హాస్టళ్ల వద్ద పెట్రోలింగ్‌
విద్యార్థినులకు దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

గుంటూరు, ఆగస్టు 25: విద్యా సంస్థలు, హాస్టళ్ల వద్ద పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన రమ్య హత్య నేపథ్యంలో నగరంలోని విద్యా సంస్థలతోపాటు వర్కింగ్‌ హాస్టల్స్‌ వద్ద మఫ్టీలో మహిళా పోలీసులు తిరుగుతున్నారు. అదేవిధంగా దిశ, రక్షక్‌ వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఆయా విద్యార్థినులకు దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు.  సోషల్‌ మీడియాను వినియోగించేటప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టింగ్స్‌కు స్పందించవద్దని వారు విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు.


Updated Date - 2021-08-26T04:41:19+05:30 IST