పొగాకులో యాంత్రీకరణను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2021-10-22T05:15:53+05:30 IST

పొగాకు సాగులో యాంత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని బోర్డు చైర్మన యడ్లపాటి ర ఘునాధబాబు కోరారు.

పొగాకులో యాంత్రీకరణను ప్రోత్సహించాలి
సీఎం జగనను సత్కరిస్తున్న చైర్మన యడ్లపాటి

సీఎం జగనకు చైర్మన యడ్లపాటి రఘునాధబాబు సూచన

గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పొగాకు సాగులో యాంత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని బోర్డు చైర్మన యడ్లపాటి ర ఘునాధబాబు కోరారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డితో చైర్మన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి యాంత్రీకరణ తప్పనిసరన్నారు. పొగాకుని శుద్ధి చేయడానికి వంట చెరుకు ఉపయోగిస్తున్నందున ఖర్చులు పెరగడంతో పాటు పర్యావరణ సమస్యలు తలెత్తున్నట్లు సీఎంకు వివరించారు. ఆక్వా రైతులకు ఇస్తున్నట్లు పొగాకు రైతులకు విద్యుతను సబ్సిడీపై ఇవ్వాలన్నారు. లేకపోతే సోలార్‌ పవర్‌ను అందుబాటులోకి తేవాలన్నారు.  


Updated Date - 2021-10-22T05:15:53+05:30 IST