పెట్రో ధరల పెంపు ప్రజలపై మోయలేని భారం
ABN , First Publish Date - 2021-07-08T19:05:43+05:30 IST
పన్నుల పేరుతో..

పొన్నూరుటౌన్: పన్నుల పేరుతో పెంచుతున్న పెట్రోల్ ధరలకు పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని పెను భారాన్నీ కేంద్ర బిజేపి ప్రభుత్వం మోపుతుందన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జక్క శ్రీనివాస్ ఆరోపించారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని కసుకర్రు పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం జక్క శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, నిత్యావసర వస్తువల ధరలను పెంచుకుంటూ వెళ్తున్నారాన్నరు. 70 శాతం ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నియంత్రణ లేని దళారి వ్యవస్థను బీజేపీ పెంచి పోషిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో చిల్లా ఆంజనేయులు, పక్కెల సీతయ్య, దేశబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.