పమిడిపాడు బ్రాంచ కెనాల్‌కు గండి

ABN , First Publish Date - 2021-12-26T05:53:55+05:30 IST

ప్రధాన సాగునీటి కాలువైన పమడిపాడు బ్రాంచ కెనాల్‌కు శనివారం గండి పడింది. దీంతో కాలువ నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది.

పమిడిపాడు బ్రాంచ కెనాల్‌కు గండి
పీబీసీకి గండి పడిన ప్రదేశం

నిలిచిన సాగునీటి సరఫరా 

నూజెండ్ల, డిసెంబరు 25: ప్రధాన సాగునీటి కాలువైన పమడిపాడు బ్రాంచ కెనాల్‌కు శనివారం గండి పడింది. దీంతో కాలువ నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది. పమిడిపాడు బ్రాంచ కెనాల్‌ 10వ మైలు ఈటీ శిధిలావస్ధకు చేరడంతో లీకేజీ ఏర్పడింది. అధికారులు సరైన సమయంలో మరమ్మతులు చేయించకపోవడంతో ఈటీ దెబ్బతిని కాలువ కట్ట కోతకుగురై కొట్టుకుపోయింది. కాలువలో ప్రవహిస్తున్న 350క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా యూటీ, వాగులు, పంట పొలాలపై నీరు ప్రవహించింది. విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ముండ్లమూరు సబ్‌డివిజన డీఈఈ వెంకట సతీష్‌ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి, బయ్యారం హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటి సరఫరాను నిలిపి వేయించారు. నీటి ప్రవాహం వెంటనేఆదివారం  నుండి యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పంటపొలాలకు సాగు నీరు అందించేందుకుచర్యలు చేపడతామని డీఈఈ తెలిపారు. పీబీసీకి గండిపడిన విషయం తెలుసుకున్నరైతులు ఆందోళనకు దిగారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. 


Updated Date - 2021-12-26T05:53:55+05:30 IST