ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-11-10T04:57:45+05:30 IST

తెనాలి - రేపల్లె - తెనాలి మధ్యన పలు ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ

గుంటూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెనాలి - రేపల్లె - తెనాలి మధ్యన పలు ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ నుంచి నెంబరు.07873 రేపల్లె - తెనాలి రైలు నిత్యం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరి 2.10కి రేపల్లె చేరుకొంటుంది. నెంబరు.07874 తెనాలి - రేపల్లె రైలు మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి 3.20కి తెనాలి చేరుతుంది. నెంబరు. 07875 రేపల్లె - తెనాలి ప్యాసింజర్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తెనాలి చేరుతుంది. నెంబరు.07876 తెనాలి - రేపల్లె రైలు సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి 5.40కి రేపల్లె చేరుకొంటుంది. నెంబరు.07277 మిర్యాలగూడ - నడికుడి మెమూ నిత్యం రాత్రి 11.25 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.55కి నడికుడి చేరుతుంది. నెంబరు. 07973 నడికుడి - మిర్యాలగూడ మెమూ వేకువజామున 4.45 గంటలకు బయలుదేరి 5.30కి మిర్యాలగూడ చేరుకొంటుంది. నెంబరు. 07276 కాచీగూడ - మిర్యాలగూడ రైలు రాత్రి 7.40 గంటలకు బయలుదేరి 11.15కి మిర్యాలగూడ చేరుతుంది. నెంబరు. 07974 మిర్యాలగూడ - కాచీగూడ రైలు వేకువజామున 5.35 గంటలకు బయలుదేరి ఉదయం 9.35కి కాచీగూడ చేరుకొంటుంది. 

 గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు.08585 విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ ఈ నెల 16, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి గుంటూరుకు వచ్చి మిర్యాలగూడ, నల్గొండ మీదగా మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 08586 సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం రైలు ఈ నెల 17, 24 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. 


Updated Date - 2021-11-10T04:57:45+05:30 IST