స్వతంత్రంగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2021-02-01T06:24:38+05:30 IST
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటును స్వతంత్రంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెనాలి సబ్‌కలెక్టర్ మయూరి అశోక్ ఆదేశించారు.

రేపల్లె, జనవరి 31: పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటును స్వతంత్రంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెనాలి సబ్‌కలెక్టర్ మయూరి అశోక్ ఆదేశించారు. ఆదివారం నిజాంపట్నంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీ ఉన్నతపాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు శ్రీనివాస్, ఎంపీడీవో నాగలక్ష్మీ, ఎస్‌ఐ శివప్రసాద్ ఉన్నారు.