సినిమాతో సమానంగా నాటికలను చూడాలి
ABN , First Publish Date - 2021-12-31T06:01:59+05:30 IST
సినిమాలతో సమానంగా నాటికలు కూడా ఆదరణ పొందినప్పుడే రంగస్థల కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మినారాయణ చెప్పారు.

అరసం జాతీయ కార్యదర్శి లక్ష్మీనారాయణ
తెనాలి అర్బన్, డిసెంబరు 30: సినిమాలతో సమానంగా నాటికలు కూడా ఆదరణ పొందినప్పుడే రంగస్థల కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మినారాయణ చెప్పారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో తెనాలి తాలుకా జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నాటికల పోటీలలో గురువారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో వివక్షతకు నాటకం తెర దించుతుందన్నారు. కృష్ణా జిల్లా అరసం అధ్యక్షుడు కొండపల్లి మాధవరావును తుమ్మల సాహితీ పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.