కరోనా నివారణకు అందరూ సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-18T06:26:40+05:30 IST

కరోనా నివారణకు అందరూ సహకరించాలని నగర మేయర్‌ మనోహర్‌నాయుడు తెలిపారు.

కరోనా నివారణకు అందరూ సహకరించాలి
మాస్క్‌లు పంపిణీచేస్తున్న మేయర్‌ మనోహర్‌, ఎమ్మెల్యే గిరి, కొత్తమా సు శ్రీనివాసరావు తదితరులు

గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణకు అందరూ సహకరించాలని నగర మేయర్‌ మనోహర్‌నాయుడు తెలిపారు. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద సోమవారం ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ కొత్తమాసు సాంబశివరావు, రోటరీ క్లబ్‌, ఆర్యవైశ్య సేవాసంఘం ఆధ్యర్యంలో తోపుడు బండ్లు, పూలబండ్లు, ఇళ్ల వద్ద కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి ఏడు మాస్క్‌లు, మెడి కల్‌ ప్యాకింగ్‌ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. నగరంలో కేసులు పెరగకుండా అందరూ కరోనా నిబంధనలు  పాటించాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో మనోధైర్యం నింపాలన్నారు. కార్యక్రమంలో కార్పొ రేటర్లు ప్రసాద్‌, శిరీష, ఉడుముల లక్ష్మి, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌, సీసీఐ విశ్రాంత అధికారి రాంబాబు, అర్బన్‌బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ కొత్తమాసు శ్రీనివాసరావు, కొత్తూరి బాలకృష్ణ, నాగేశ్వరరావు, కొణిజేటి ప్రసాద్‌, పచ్చిపులుసు సతీష్‌, కోట నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-05-18T06:26:40+05:30 IST