మూడేళ్లుగా మూలన!

ABN , First Publish Date - 2021-08-21T04:44:53+05:30 IST

అధికారుల నిర్వక్ష్యం కారణంగా రైతులకు సబ్సిడీపై అందాల్సిన జింకు ప్యాకెట్లు మూలకు చేరాయి. గడువు తీరిపోవడంతో వాటిని తిరిగి పంపుతున్నారు.

మూడేళ్లుగా మూలన!
బాపట్ల మార్కెట్‌యార్డు గోదాములో కాలం చెల్లిన జింకు ప్యాకెట్‌లు

సరఫరాకు నోచని జింకు ప్యాకెట్లు

బాపట్ల, ఆగస్టు 20: అధికారుల నిర్వక్ష్యం కారణంగా రైతులకు సబ్సిడీపై అందాల్సిన జింకు ప్యాకెట్లు మూలకు చేరాయి. గడువు తీరిపోవడంతో వాటిని తిరిగి పంపుతున్నారు. మూడేళ్ల కిందట బాపట్లకు మార్క్‌ఫెడ్‌ ద్వారా దాదాపు 200 కేజీల జింకు ప్యాకెట్లు వచ్చాయి. వాటిని రైతులకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. కానీ వాటిని ఏళ్లు గడిచినా పంపిణీ చేయకుండా అక్కడే ఉంచారు. అధికారులు కూడా వీటిని పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడవి పనికిరాకుండా పోయాయి. రైతులకు విత్తన శుద్ధి చేసుకునేందుకు ఉచితంగా ఇచ్చే సూడోమోనాస్‌ పౌడర్‌ ప్యాకెట్‌లు కూడా రైతులకు పంచకుండా గుట్టలుగా పడేశారు. ఈ విషయంపై ఏడీఏ ఎ.లక్ష్మీని వివరణ కోరగా జింకులోపం ఉన్న పొలాల రైతులకు ఈ ప్యాకెట్లు ఇచ్చామని మిగిలిన వాటిని తిరిగి మార్క్‌ఫెడ్‌కు పంపిస్తామన్నారు. 

   

Updated Date - 2021-08-21T04:44:53+05:30 IST