2,338 మందికి వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం లబ్ధి

ABN , First Publish Date - 2021-08-11T04:26:58+05:30 IST

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో 2,338 మందికి ఆర్థికసాయం అందిందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

2,338 మందికి వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం లబ్ధి
వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కు విడుదల చేస్తున్న హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు

హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో 2,338 మందికి ఆర్థికసాయం అందిందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వారందరికీ రూ.24 వేల చొప్పున రూ. 5.61 కోట్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. మంగళవారం వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా వరుసగా మూడో ఏడాది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా సీఎం జగన్‌ నిర్ణీత సమయానికి ఆర్థికసాయం విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కల్పలత, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిదర్‌, ముస్తఫా, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జాయింట్‌ కలెక్టర్‌(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ శుభం బన్సల్‌, నగరపాలకసంస్థ డిప్యూటీ మేయర్‌ సజిల, జౌళిశాఖ ఏడీ వనజ పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-11T04:26:58+05:30 IST